Even as the world continues to rave over the miraculous and humane Thailand rescue mission that saved 12 young boys and their football coach, in India, another rescue mission seems to garnering attention too. A video of a bunch of young men coming together to save a little goat from a deep tube-well has gone viral on the Internet.
ఓ మేక పిల్లను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు ఆ యువకులు. పొరపాటు జరిగితే తమ ప్రాణాలు పోతాయని తెలిసినా.. ఆ మేక పిల్ల ప్రాణాలు కాపాడిన యువకులపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మేకపిల్లను కాపాడిన 'రెస్క్యూ ఆపరేషన్' వీడియో వైరల్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని ఓ అటవీ ప్రాంతంలో మేతకోసమని వచ్చిన మేకపిల్ల తెరిచివున్న బోరుబావిలో పడిపోయింది. దీన్ని గమనించిన యువకులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ మేక పిల్లను ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్నారు.
#goat
#youth
#borewell
#karnataka